సర్పంచ్ రఘువంశీ గౌడ్ చర్చలు
తెలుగు గళం న్యూస్ ఐనవోలు/ఏప్రిల్ 28
హనుమకొండ జిల్లా:ఐనవోలు మండల రైతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామ సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్ సొసైటీ అధికారులతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు.ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పంట రుణాల మంజూరులో జాప్యం, ఎరువుల సరఫరా, తరుగు, తేమ పేరిట జరుగుతున్న కోతలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.“రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి. సొసైటీ ద్వారా అన్ని సౌకర్యాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే”అని సర్పంచ్ రఘువంశీ గౌడ్ అన్నారు. రైతుల పక్షాన ఎల్లప్పుడూ అండగా ఉంటానని, సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.ఈ చర్చల సందర్భంగా సొసైటీ అధికారులు సానుకూలంగా స్పందించి, రైతుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో గ్రామ రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.