లక్ష్మీపురం గుడిసె సెంటర్లో గుడిసెల తొలగింపుపై వివాదం
తెలుగు గళం న్యూస్ వరంగల్, ఏప్రిల్ 29
లక్ష్మీపురం గుడిసె సెంటర్లో గుడిసెల తొలగింపుపై వివాదం నెలకొంది. తమ గుడిసెలను బలవంతంగా పీకేసి రోడ్డు మీదకు నెట్టేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై బుధవారం వారు మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేశారు.బాధితుల వివరాల ప్రకారం, 2022లో తిమ్మాపూర్ శివారులోని బెస్తం చెరువు సమీపంలో లక్ష్మీపురం పేరుతో కొందరు పేద కుటుంబాలు గుడిసెలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. అయితే, సెంటర్ నాయకుడిగా ఉన్న సాంబమూర్తి తన ఆధీనంలో ఉన్న వారితో కలిసి గుడిసెలను బలవంతంగా తొలగించాడని వారు ఆరోపించారు.ప్రశ్నించిన వారిపై దాడులు చేయించి, నాలుగు సంవత్సరాలుగా నివసిస్తున్న గుడిసెలను పీకేయించారని బాధితులు తెలిపారు. తమ వద్ద నుండి డబ్బులు వసూలు చేసి, అనంతరం గుడిసెలను ఇతరులకు అమ్ముతున్నారని కూడా ఆరోపించారు.ఈ ఘటనతో నిరాశ్రయులైన తాము న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు.గుడిసెల తొలగింపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమకు భద్రతతో పాటు పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేసిన వారిలో మన్నూరు జ్యోతి, వెంకటలక్ష్మి, సమీనా, బాబర్, నాగేందర్, కిరణ్, తబిత, ఆరోగ్యం, గణేష్, చరణ్, శోభ, పుష్ప తదితరులు ఉన్నారు.