సమాజంలో మహిళల పాత్ర” అంశంపై అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ సదస్సు

హైదరాబాద్, 21 ఆగస్టు 2026
అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీకి చెందిన మహిళల శాఖ ఆధ్వర్యంలో “సమాజంలో మహిళల పాత్ర” అనే అంశంపై సెమినార్ శుక్రవారం, 21 ఆగస్టు 2026న ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజీలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమం అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ సికింద్రాబాద్ మహిళల శాఖ అధ్యక్షురాలు జుబేదా కలీం, ఉపాధ్యక్షురాలు శ్రీమతి అఫ్రోజ్ బాను గారి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సదస్సులో మహిళల గౌరవం, స్థానం మరియు ప్రాముఖ్యతకు సంబంధించిన క్రైస్తవ మరియు ఇస్లామిక్ దృక్కోణాలను చర్చించారు. మత సామరస్యం, పరస్పర అవగాహన మరియు గౌరవాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమం లో గౌరవ సకీన అల్లాద్దీన్ తో పాటు అనేక ముస్లిం మరియు క్రిస్టియన్ ప్రతినిధులు వివిధ ధర్మాలకు చెందిన అనేకమంది పాల్గొన్నారు.
క్రైస్తవ దృక్కోణంలో, శ్రీమతి పి. ఉషారాణి గారు “బైబిల్ బోధనల వెలుగులో మహిళల ప్రాముఖ్యత ” అనే అంశంపై ప్రసంగించారు. ముస్లిం దృక్కోణంలో సమీరా రిజ్వాన్ “ఇస్లాంలో మహిళల స్థానం” అనే అంశంపై ప్రసంగించారు.ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో ఇస్లాంలో మహిళలకు కల్పించబడిన స్థానం, హక్కులు మరియు బాధ్యతలను ఆమె వివరించారు. ఇస్లాం బోధనలలో మహిళలకు కల్పించబడిన ఆధ్యాత్మిక మరియు సామాజిక సమానత్వం, గౌరవాన్ని ఆమె ప్రత్యేకంగా వివరించారు.ఈ సదస్సు ద్వారా ఇరు మత సంప్రదాయాలకు చెందిన వారు తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకునే అవకాశం లభించింది. అలాగే, సమాజంలో మహిళల పాత్ర మరియు ప్రాముఖ్యతకు సంబంధించి క్రైస్తవ మతం మరియు ఇస్లాం బోధనలను పరస్పరం అర్థం చేసుకునే అవకాశం ఏర్పడింది.
ఈ కార్యక్రమం పరస్పర గౌరవం, మత సామరస్యం మరియు సోదరభావంతో విజయవంతంగా ముగిసింది.
శాంతి, సోదర భావం, మత సామరస్యం మరియు మానవ సేవను ప్రోత్సహించేందుకు అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ చేస్తున్న ప్రయత్నాలలో ఈ కార్యక్రమం మరో ముందడుగు.
అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఒక శాంతిని ప్రేమించే ఇస్లాంసంఘం. ఇది 1889 సంవత్సరంలో హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ గారి దైవిక మార్గదర్శకత్వంలో స్థాపించబడింది. ఆయనను మసీహ్ మౌఊద్ మరియు యుగ సంస్కర్తగా విశ్వసిస్తారు.
దీని ప్రధాన కార్యాలయం పంజాబ్లోని ఖాదియాన్లో ఉంది. అన్ని రకాల హింసను మేము ఖండిస్తాము. మానవాళిని గౌరవించడం ఇస్లామిక్ విశ్వాసంలో అంతర్భాగమని మేము విశ్వసిస్తాము. “అందరినీ ప్రేమించు, ఎవరినీ ద్వేషించకు” అనేది మా ప్రాథమిక నినాదం. కమ్యూనిటీకి అనుబంధ సంస్థ అయిన హ్యూమానిటీ ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో ఆహారం, నీరు, పునరావాసం మరియు విపత్తు సహాయక కార్యక్రమాలను అందిస్తోంది.
కమ్యూనిటీ స్థాపకుడు హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ గారి తరువాత ఐదవ ఖలీఫా మరియు వారసుడిగా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ గారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్త అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీకి అధిపతిగా ఉన్నారు. కమ్యూనిటీకి ప్రపంచ ప్రధాన కార్యాలయం యునైటెడ్ కింగ్డమ్లో ఉంది.
ప్రస్తుత ఖలీఫా గారి దైవిక మార్గదర్శకత్వంలో, ఈ కమ్యూనిటీ ప్రపంచంలోని 210కి పైగా దేశాలకు విస్తరించి, శాంతి, సమానత్వం, న్యాయం, విధేయత, కరుణ మరియు సోదరభావాన్ని ప్రోత్సహిస్తోంది. ఇవి ఇస్లాం యొక్క ప్రాథమిక బోధనలు.