ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ

రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్య సేవల అమలు, పారిశుధ్య పరిస్థితులు, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో రికార్డుల నిర్వహణ, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరుపై వెంకటేశ్వర్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, ఔట్ పేషెంట్ విభాగాలు, ఇంటర్నల్ వార్డులు, మందుల నిల్వ స్టోర్ ను ఆయన కనిఖీ చేశారు. రోగులకు వెరుగైన వైద్య సేవలు అందించాలని, సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు. ప్రభుత్వం వైద్య సేవలపై చాలా ఫోకస్ చేస్తుందని విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు సమర్థవంతమైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ వైద్యశాలలు కీలక భూమిక వహించాలని అన్నారు. పారిశుధ్యం, మందుల లభ్యత, సిబ్బంది హాజరు తప్పనిసరిగా నిరంతరం కొనసాగాలని సూచించారు. ప్రజల్లో వైద్య సేవలపై నమ్మకం కలిగించేలా సేవలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
అందించాలి అని తెలిపారు. వైద్య సిబ్బంది సేవలకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ఆయన ప్రత్యేకంగా ఆదేశించారు. అనంతరం రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉపసంచాలకులు నాగరాజు,ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్యరాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *