మున్సిపల్ కార్మికుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వానికి గుణపాఠంమున్సిపల్ కార్మికుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వానికి గుణపాఠం

ఫిబ్రవరి 12న విధులు బహిష్కరించి మహా ర్యాలీ–సిఐటియు పిలుపు హైదరాబాద్ నగరాన్ని శుభ్రంగా ఉంచుతూ ప్రతిరోజూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని సిఐటియు తీవ్రంగా ఖండించింది. చెత్తలో పనిచేస్తూ అనారోగ్యాలు, ప్రమాదాల మధ్య బతుకుతుంటే కూడా వేతనాల పెంపు విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు రూ.26,000 వేతనం, సూపర్వైజర్లు మరియు ఎఫ్‌ఎస్‌ఏలకు నెలకు రూ.35,000 వేతనం ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ న్యాయమైన డిమాండ్ల అమలుకు యూసఫ్‌గూడా డిప్యూటీ కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేసినట్లు తెలిపింది.కార్మికుల జీవన్మరణ సమస్యలను పక్కనపెట్టి నగరానికి ర్యాంకులు వస్తే చాలని భావించే ప్రభుత్వ వైఖరి అమానుషమని సిఐటియు విమర్శించింది.పనికి భద్రత, ఆరోగ్య రక్షణ, కనీస సౌకర్యాలు లేకపోయినా కార్మికులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్నారని గుర్తు చేసింది.ఈ పరిస్థితులకు నిరసనగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మున్సిపల్ కార్మికులందరూ ఫిబ్రవరి 12న విధులు బహిష్కరించి, ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి ఇందిరాపార్క్ వరకు జరిగే మహా ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.అదేవిధంగా ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరింది. డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేసింది.ఈ కార్యక్రమంలో సిఐటియు జూబ్లీహిల్స్ నాయకులు రాపర్తి అశోక్, టి. సాయి శేషగిరిరావు, జె. స్వామి, సికిందర్ తదితరులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *