
ఉస్మానియా వర్సిటీ స్నాతకోత్సవంలో డా. రాపాల విశాలాక్షికి పీహెచ్డీ, బంగారు పతకం
జఫర్గడ్, సెప్టెంబర్ 8 (ఈ69న్యూస్)
జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన రాపాల వెంకటేశ్వర్లు–సరోజన దంపతుల కుమార్తె డా. రాపాల విశాలాక్షి ప్రతిభ చాటారు. నిరంతర కృషి, పట్టుదలతో బోటనీ (వృక్షశాస్త్రం) విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవంలో పీహెచ్డీ పట్టాతో పాటు బంగారు పతకాన్ని అందుకున్నారు.తెలంగాణ గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శ్రీ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా డా. రాపాల విశాలాక్షి పీహెచ్డీ పట్టా, బంగారు పతకం స్వీకరించారు.గ్రామీణ ప్రాంతం నుంచి విద్యా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఈ ఘనత సాధించడం పట్ల ఉప్పుగల్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా డా. రాపాల విశాలాక్షి మాట్లాడుతూ తన విద్యా ప్రయాణంలో మార్గదర్శకులుగా నిలిచిన గురువులకు, తనను నిరంతరం ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత విద్యలో అద్భుతమైన విజయాలు సాధించవచ్చని ఆమె నిరూపించారు.
