జెండా ఆవిష్కరణ చేసిన కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు
- జెండా ఆవిష్కరణ చేసిన కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు
తెలుగు గళం న్యూస్, ఖమ్మం పట్టణం ఏప్రిల్ 28, ఖమ్మం జిల్లా: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసే లక్ష్యంతో ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను 48వ డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తదనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసి తెలంగాణ గీతాన్ని ఆలపించి కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ అభిమానులకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ స్వీట్స్ పంచారు. ఈ ఆవిర్భవ దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్పోరేటర్ తోట మాట్లాడుతూ తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర లక్ష్యంతో 2001 ఏప్రిల్ 27వ తారీఖున మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు BRS పార్టీని స్థాపించి ప్రత్యేక రాష్ట్ర లక్షణ సాధనగా అలుపెరుగని పోరాటం చేశారని. వారి పోరాట ఫలితమే ఈనాటి మన తెలంగాణ రాష్ట్రమని తమ పోరాటంతో భారత చిత్రపటంలో 29వ రాష్ట్రంగా నాంది పలికిన మహనీయులు కేసీఆర్ గారు అని అటువంటి నాయకులు స్థాపించిన ఈ పార్టీ 26 వసంతాలు పూర్తి చేసుకోవటం తెలంగాణ బిడ్డగా ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ రోజు అని కొనియాడారు. ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ నాయకులు వంగాల వెంకట్,
చేతి కృష్ణ,
తోట రమేష్ & టీం
కిషన్ నాయక్,బాబా, వేల్పుల శ్రీనివాస్, రెడ్డి, చింటూ, బాబీ,ప్రభాకర్, రియాజ్, రవీందర్, వీరందర్, నిరంజన్, శ్రీను,
గురు స్వామి మరియు మహిళా సభ్యులు పాల్గొన్నారు.