
ఈ69న్యూస్ వరంగల్
వరంగల్ తూర్పు నియోజకవర్గ జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అప్పగించాలంటూ టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పొడేటి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశాయిపేటలో జర్నలిస్టుల కోసం నిర్మించిన ఇండ్లు ఇంకా కేటాయించలేదని వాపోయారు. హామీలు ఇచ్చినా అమలు చేయకపోవడంతో జర్నలిస్టులు దీక్షలు చేపట్టారని, పూర్తి న్యాయం కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు.