ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ
తెలుగు గళం న్యూస్ అనంతరం ఏప్రిల్ 27
తాటికొండ నాగేశ్వరి మృతికి కారణమైన బేడ బుడగ జంగం కుల పెద్దలపై తక్షణమే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ డిమాండ్ చేశారు.అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందు మహిళా ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ, వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి,ఆర్ఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సామ్రాట్ మధు, బహుజన రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోయ ఆదినారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పూజారి నరసింహమూర్తి పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ గార్లదిన్నే మండలం ఆర్.ఎస్. కల్లూరు గ్రామానికి చెందిన తాటికొండ నాగేశ్వరి (భర్త: మహేష్) ఈ నెల 16న ఆత్మహత్యాయత్నం చేసి, అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 17న మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు ఆమె తండ్రి విభూతి గాంధీ, ప్రియుడు విభూతి సింహాద్రి, అలాగే కుల పెద్దలు కారణమని ఆరోపించారు.వివాహేతర సంబంధం నేపథ్యంలో కుల పెద్దలు పంచాయితీ పేరుతో డబ్బులు వసూలు చేసి, బాధితురాలిని అవమానించడం, కుటుంబ సభ్యుల చేత హింసకు గురిచేయడం వల్ల ఆమె తీవ్ర మనోవేదనకు గురై ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఉరి వేసుకున్న తర్వాత కూడా ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యం చేయడం ఆమె మృతికి కారణమైందని అన్నారు.కుల పంచాయితీల పేరుతో మహిళలపై దౌర్జన్యాలు, డబ్బుల వసూళ్లు, అవమానాలు జరుగుతున్నాయని, ఇటువంటి చట్టవిరుద్ధ చర్యలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో సంబంధిత కుల పెద్దలు, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కురువ పద్మావతి, రామాంజినమ్మ, కోమలి, పావని, కుళ్లాయమ్మ, అఖిల, లింగమ్మ, షాను, తబుసమ్ తదితరులు పాల్గొన్నారు.