మాజీ సర్పంచ్ ఆమడగాని రాజు యాదవ్, ప్రస్తుత సర్పంచ్ డెక్క సునీత - కుమారస్వామి హాజరయ్యారు
తెలుగు గళం న్యూస్,పర్వతగిరి/ ఏప్రిల్27
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని వడ్లకొండ గ్రామంలో భారత రాష్ట్ర సమితి పార్టీ 26వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు పట్టపురం వెంకట్ రాజు ఆధ్వర్యంలో సోమవారం పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ ఆమడగాని రాజు యాదవ్, ప్రస్తుత సర్పంచ్ డెక్క సునీత – కుమారస్వామి హాజరయ్యారు.పార్టీ శ్రేణులతో కలిసి గ్రామ అధ్యక్షులు పట్టపురం వెంకట్ రాజు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భమైన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని, అధికారంలో ఉన్నప్పుడు హామీలు ఇవ్వకుండానే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కెసిఆర్ ది అని గుర్తు చేశారు. స్వరాష్ట్రం కోసం స్వరాష్ట్రంలో ఏర్పాటైన పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని, మళ్లీ తెలంగాణను అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ డెక్క సునీత-కుమారస్వామి, మాజీ సర్పంచ్ అమడగాని రాజు యాదవ్, మాజీ రైతుబంధు అధ్యక్షులు తక్కలపల్లి సంపత్ రావు, బాబురావు, జుట్టు కొండ పెద్ద నరసయ్య, చిన్న నరసయ్య, నాగన్న, పొడిశెట్టి దేవేందర్, కోదాటి దేవేందర్ రావు, రవి, పట్టాపురం ఎల్లగౌడ్, పల్లె ప్రకాష్, ఉప్పలయ్య, సురేష్, లావణ్య, భాగ్యలక్ష్మి, రాకేష్ మరియు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు