కడదాకా పోరాడిన వ్యక్తి ఆది వెంకటేశ్వర్లు
జూలకంటి రంగారెడ్డి
మధిర,ఏప్రియల్27(తెలుగు గళం)న్యూస్:కార్మికుల కోసం కర్షకుల కోసం తన నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం కడదాకా పోరాడిన వ్యక్తి ఆది వెంకటేశ్వర్లు ( పెద్దబ్బాయి) అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శు వర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు.మధిరలో సోమవారం శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో ఆది వెంకటేశ్వర్లు ( పెద్దబ్బాయి) సంస్కరణ సభ పట్టణ కార్యదర్శి పడకంటి మురళి అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఆది వెంకటేశ్వర్లు మధిరలో కార్మికుల కోసం, ఎర్రజెండా కోసం, తను నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తుది శ్వాస వరకు పోరాడారని, గత 50 సంవత్సరాల నుండి మధిర పట్టణంలో బిల్డింగ్ రంగాన్ని అదేవిధంగా వివిధ కార్మిక సంఘాలను కార్మికుల సమస్యలను పరిష్కరించడంలోనూ కార్మికులను ఐక్యపరచడంలోనూ తన వంతు పాత్రను నిర్వహించారన్నారు. పెద్దబ్బాయి పెద్ద మనసున్న నాయకుడిగా, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పెద్దన్న పాత్రను పోషించేవాడు అన్నారు. ఎత్తిన జెండాలు దించకుండా కడదాకా తను నమ్మిన సిద్ధాంతం కోసం అందుబాటులో ఉండి పోరాటాలను నిర్వహించడంలోనూ, పోరాటంలో పాల్గొని తనవంతు పాత్రను పోషించేవాడు. ఈ రోజుల్లో అవకాశవాద రాజకీయాలు, కార్పొరేట్ రాజకీయాలు, పార్టీల ఫిరాయింపులు , జరుగుతున్న కాలంలో ఆది వెంకటేశ్వర్లు తను నమ్మిన ఎర్రజెండా కిందే ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా మార్కస్ట్ సిద్ధాంతం అనేది మరణం లేనిదని అట్లాంటి సిద్ధాంతాన్ని తుది శ్వాస వరకు నమ్మిన వ్యక్తి ఆది వెంకటేశ్వర్లు అని అట్లాంటి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళులు అన్నారు.
ఈ కార్యక్రమంలో: సిపిఎం పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు శీలం నరసింహారావు, దివ్వెల వీరయ్య, మందా సైదులు, ఎర్రిపాలెం బోనకల్ మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్, కిలారి సురేష్, సిపిఎం పార్టీ నాయకులు పాపినేని రామ నరసయ్య, మండవ పనింద్రకుమారి, పార్టీ నాయకులు మందడపు ఉపేంద్ర, తేలప్రోలు రాధాకృష్ణ, గుడిమెట్ల రజిత, నోముల మల్లాచారి, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, బిల్లింగ్ రంగ కార్మికులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు