టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
*కాంగ్రెస్ పార్టీ కండువా కప్పిఆహ్వానించిన
*టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
*వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
పర్వతగిరి, తెలుగు గళం న్యూస్ / ఏప్రిల్ 28 :
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పిటిసి మేడిశెట్టి రాములు హస్తం గుటికి చేరారు.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ ) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కెఆర్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు అయుబ్ ఖాన్, ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా మాజి జెడ్పిటిసి మేడిశెట్టి రాములు మాట్లాడుతు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసి వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్ నాగరాజు సారధ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం పనిచేయాలని నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వర్థన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉప అధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు, మండల అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్,కరాటే ప్రభాకర్, వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు రవీందర్, చిటుకూరి అశోక్ వర్ధన్నపేట నాయకులు తదితరులు పాల్గొన్నారు.