సిపిఎం పార్టీ నుండి ధర్మారపు సాంబమూర్తిని బహిష్క
తెలుగు గళం న్యూస్ వరంగల్ ఏప్రిల్ 29
సిపిఎం పార్టీ నుండి ధర్మారపు సాంబమూర్తిని బహిష్కరించినట్లు సిపిఎం వరంగల్ జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య పత్రికా ప్రకటనలో తెలిపారు.లక్ష్మీపురం గుడిసెలకు బాధ్యుడిగా ఉన్న సాంబమూర్తి ప్రజల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని, పేదల గుడిసెలను పీకివేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై పార్టీ పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆయన తన ప్రవర్తనను మార్చుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.పార్టీ నియమాలకు విరుద్ధంగా, ఒంటెద్దు పోకడతో వ్యవహరించినందుకు సాంబమూర్తిని పార్టీ నుండి బహిష్కరించినట్లు సిహెచ్ రంగయ్య స్పష్టం చేశారు.