తల్లి పాలే బిడ్డకు తొలి పోషకాహారం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం అంగన్వాడీ సెంటర్ ఒన్ లో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు ఘనంగా నిర్వహిచారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ యశోద మాట్లాడుతూ తల్లి పాలు శిశువుకు సంపూర్ణమైన పోషకాహారాన్ని అందించడంతో పాటు, అనేక అనారోగ్యాల నుంచి రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అన్నారు,
శిశువు పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు (కొలస్ట్రం) ఎంతో విలువైనవి.వీటిలో శిశువు రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉంటాయి అన్నారు,సాధ్యమైనంత వరకు పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం, మొదటి ఆరు నెలలు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ఆరోగ్యకరమైన అలవాటు అన్నారు,తల్లి పాల ప్రాముఖ్యతపై తల్లులు, కుటుంబ సభ్యులు, ప్రజల్లో అవగాహన కల్పించడమే తల్లి పాల వారోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం అన్నారు,ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తల్లి పాలు ఎంతో అవసరం అని తెలిపారు.ఈ సందర్బంగా పిల్లలకు అక్షరాబ్యాసం కార్యక్రమం నిర్వహించరు,ఈ కార్యక్రమం లోఅంగన్వాడీ టీచర్ యం యశోద, ఆయా విస్సంపెల్లి నాగమ్మ, ఆశవర్కర్ అనురాధ, ఆదిమూల పద్మ తదితరులు పాల్గొన్నారు.