ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటూరునాగారంలో ఆదివాసీ సమాజం భారీగా నిర్వహించిన వేడుకలకు స్థానిక ఐటీడీఏ పీఓ, జిల్లా కలెక్టర్ హాజరు కాకపోవడం తీవ్రంగా బాధాకరమని ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆదివాసీల హక్కులు, సమస్యలు, జల్–జంగల్–జమీన్ పరిరక్షణ, పోడు భూములు, అటవీ హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి, రహదారులు, మౌలిక వసతులు తదితర అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఇలాంటి కీలకమైన రోజున ఆదివాసీ సమాజం మధ్య ఉండాల్సిన ఉన్నతాధికారులు కార్యక్రమానికి దూరంగా ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఏటూరునాగారంలో వై జంక్షన్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, కొమురం భీమ్‌కు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం గిరిజన భవన్లో వేడుకలు నిర్వహించారు. వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీలు తమ సమస్యలు, డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే మెమోరాండాలు స్వీకరించి, సమస్యలపై ప్రత్యక్షంగా స్పందించాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని వారు తెలిపారు. “ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజునే ఆదివాసీలను అధికారులు పట్టించుకోకపోతే.. ఇక మా సమస్యలు ఎప్పుడు వింటారు?” అని ఆదివాసీ సంఘాల నాయకులు ప్రశ్నించారు. ఆదివాసీ ప్రాంతాల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఐటీడీఏ పరిధిలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ వెంటనే స్పందించి ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమస్యలపై కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఆదివాసీల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం కొనసాగిస్తే, ప్రజాస్వామ్య పద్ధతిలో మరింత బలమైన ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని ఆదివాసీ సంఘాలు డిమాండ్.
ఐటీడీఏ పీఓ, జిల్లా కలెక్టర్ గైర్హాజరు బాధాకరం.. ఆదివాసీ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యమా?
ఆదివాసీల గోడు వినేందుకు సమయం లేదా? — వెంటనే స్పందించాలి: ఆదివాసీ సంఘాల డిమాండ్