E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
భవన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నగరంలోని గాంధీచౌక్ అడ్డా పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాల్వ ఒడ్డున ఉన్న యూనియన్ కార్యాలయంలో యూనియన్ గౌరవ సలహాదారు బండి శ్రీను జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో: యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎస్కే సలీం, అధ్యక్షులు పావురాల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు చచ్చు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి జంగం నగేష్, సహాయ కార్యదర్శి పాశం కృష్ణారెడ్డి, కోశాధికారి కాకులారం కిట్టు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ సభ్యులు, మేస్త్రిలు పెద్ద సంఖ్యలో హాజరై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
