రాజీవ్ గాంధీ ఆశయాలు ఆధునిక భారతానికి స్ఫూర్తి

వరంగల్ జిల్లా:వర్ధన్నపేట నియోజకవర్గం,వర్ధన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో నవ భారత నిర్మాత,మాజీ ప్రధానమంత్రి,భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు
ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. “భారతదేశ అభివృద్ధి, ఆధునికీకరణ,యువత భవిష్యత్తు కోసం దూరదృష్టితో పనిచేసిన మహానేత రాజీవ్ గాంధీ. దేశాన్ని 21వ శతాబ్దం వైపు నడిపించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రగతికి బలమైన పునాది వేశాయి” అన్నారు.కంప్యూటరీకరణ, టెలికమ్యూనికేషన్స్,సాంకేతిక రంగాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత భారతదేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసిందని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం స్థానిక సంస్థలకు అధికారాలు కల్పించారని,ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు అవకాశం కల్పించారని కొనియాడారు.దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ త్యాగం చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.కార్యక్రమంలో
మండల అధ్యక్షుడు పోషాల వెంకన్న, పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్,మున్సిపల్ చైర్పర్సన్ పాలకుర్తి సారంగపాణి,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,ఐనవోలు టెంపుల్ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రతి బాణుప్రసాద్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు తీగల సునీత, కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, తిరుపెల్లి వాణి,టెంపుల్ డైరెక్టర్ ఖీమా నాయక్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాను నాయక్, లింగం రజిత రెడ్డి, పాక సుజాత, కొండేటి మహేందర్,రామక్రిష్ణ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దామెర ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
