స్టేషన్ ఘన్పూర్ ఎస్హెచ్ఓగా సేవలందించిన జి.వేణు బదిలీ

విధులకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఎస్ హెచ్ ఓ వేణు
ఈ69 న్యూస్ స్టేషన్ ఘన్పూర్ సెప్టెంబర్ 02
స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా రెండు సంవత్సరాల ఒక నెల పాటు విధులు నిర్వహించిన పోలీస్ ఇన్స్పెక్టర్ జి. వేణు బదిలీపై రఘునాథపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా వెళ్లనున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్పూర్లో విధులు నిర్వహించిన కాలంలో తనకు సహకరించిన ప్రజలకు, మీడియా మిత్రులకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.విధి నిర్వహణలో ప్రజలు, మీడియా ప్రతినిధులు అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.స్టేషన్ ఘన్పూర్లో పనిచేసిన సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ సిబ్బందితో కలిసి కృషి చేశానని తెలిపారు.బదిలీపై రఘునాథపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో తనకు అందించిన సహకారాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆయన కోరారు.