సీపీఎం వేంసూరు మండల కమిటి సభ్యులు మోరంపూడి వెంకటేశ్వరరావు
సత్తుపల్లి/వేంసూరు,ఆగస్టు07(తెలుగుగళం) న్యూస్:
రైతాంగం తమ పంటలకు వినియోగించే యూరియా ఇతర ఎరువుల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన FFS యాప్ బుకింగ్ విధానం రద్దు చేయాలని సీపీఎం వేంసూరు మండల కమిటి సభ్యులు మోరంపూడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.శుక్రవారం రాత్రి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలోని దుద్దుపూడి గ్రామంలో జరిగిన సీపీఎం గ్రామశాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళారులను ఆరికట్టకుండా రైతులను దొంగలుగా చూడటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.ఆగస్టు 10 న జరగనున్న జైల్ బరో లో రైతాంగం పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో: గ్రామ శాఖ కార్యదర్శి చీపు
రామకృష్ణ,పూరేటి సుగుణరావు,కంటే గోపాలం,కొచ్చర్ల సుందరం పాల్గొన్నారు.