
ఈ69న్యూస్ ధర్మసాగర్, ఏప్రిల్ 26:
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని ఐకెపి సెంటర్లో 41 కిలోలకు బదులు 43 కిలోల తూకం వేస్తున్నారనే ఆరోపణలు వెలువడడంతో సెంటర్ను తాత్కాలికంగా నిలిపివేశారు.రైతుల అనుమతి లేకుండా తూకం జరుగుతోందని, కొందరు రాజకీయ స్వలాభం కోసం ఈ అంశాన్ని ఉపయోగించుకుంటున్నారనే ప్రచారం కొనసాగుతోంది.అయితే ఈ ఆరోపణలను స్థానిక రైతులు ఖండించారు. గత ఆరు, ఏడు సంవత్సరాలుగా సెంటర్ సక్రమంగా నిర్వహణ జరుగుతోందని, తమ అనుమతి లేకుండా ఎప్పుడూ తూకం జరగలేదని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటపై తమకే పూర్తి అవగాహన ఉందని, అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వర్షాలు కురిసే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ధాన్యం తడవడం, వాగుల్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.వెంటనే ఐకెపి సెంటర్ను ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.