

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గాయం తిరుపతిరావు”
పెనుబల్లి,ఏప్రియల్21 e69న్యూస్:
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఉపాధి హామీ చట్టం రోజురోజుకు బలహీనపడుతూ రాబోయే రోజుల్లో ఉపాధి హామీని పూర్తిగా ఎత్తివేయడం కోసం మోడీ ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు చేయడంలో భాగంగానే బీపీజీ రాంజీ పథకాన్ని తీసుకురావడం ఆ కుట్రలో భాగమేనని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గాయం తిరుపతిరావు చెమట విశ్వనాథం మోడీ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు పెనుబల్లి మండలంలోని పార్థసారధిపురం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి వారికున్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది కూలీలు వేతనాలు రావడం లేదని సరైన కూలీ గిట్టుబాటు కావడం లేదని అన్నారు గతంలో లాగా ఈ పని లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ సమస్యలను విన్నవించుకున్నారు అనంతరం గాయం తిరుపతిరావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు పోరాడి సాధించుకున్న పనైనా చూపండి తిండి అయినా పెట్టండి అనే నినాదంతో వ్యవసాయ కార్మిక సంఘం ఇతర వామపక్ష సంఘాలు పోరాటాలు జరిపిన ఫలితంగా 2005లో వామపక్షా మద్దతుతో ఉపాధి హామీ సర్తాన్ని సాధిస్తే 2014 నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీకి రోజురోజు బడ్జెట్లో కోతలు విధిస్తూ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి చర్యలకు కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పూనుకుందని ఈ దేశంలోని కోట్లాదిమంది ఉపాధి కార్మికుల బ్రతుకులను అపహాస్యం చేసేటటువంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదని ఉపాధి హామీ పనిచేస్తే అనేక రకాలైన ఆంక్షలు కూలీలపై పెడుతూ పద్దస్తమానం పనిచేస్తే 100 నుండి 150 రూపాయలకు కూడా కూలి గిట్టుబాటు కావడం లేదని ఇలాగైతే కుటుంబాల్లోనే తమ పిల్లలకు చదువులు వైద్యం ఇతర అనేక సౌకర్యాలకు చాలీచాలని వేతనాలు సరిపోతాయా అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు ఒకవైపు నిత్యవసర వస్తువుల ధరలను పెంచుతూ కోట్లాదిమంది ప్రజలకు పని కల్పించే చట్టాలను తుంగలో తొక్కి భూమిలేని పేదలు జీవించాలంటే రోజురోజు దినదిన గండంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో యాంత్రికరణ వచ్చిన తర్వాత వ్యవసాయ కార్మికులకు పనులు పూర్తిగా తగ్గిపోయాయని వారన్నారు వెంటనే విపిజి రాంజీ బిల్లును వెనక్కి తీసుకొని ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని చట్టాన్ని అమలు చేసినటువంటి బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని రాష్ట్రాల పైకి నెట్టి తాను తప్పించుకోవాలనే ఒక కుటిలనీతిని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రదర్శిస్తుందని దాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో: వ్యవసాయకార్మిక సంఘం సభ్యులు కుంజా ఈదబాబు, సున్నం శివ,పోతమ్మ, ముత్తమ్మ రాజమ్మ, పోతురాజు కుంజదాసు తదితరులు పాల్గొన్నారు.