కాంగ్రెస్ మార్క్ పాలన.. నిరుపేదలకు కొండంత అండ
సంక్షేమ పథకాలతో ఇళ్లకు వెలుగులు.. ఎమ్మెల్యే రేవూరి ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రగతి
— పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ యూత్ నాయకుడు ఇఫ్తాకర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి, రైతులకు , మహిళలకు , యువతకు మరియు వృద్ధులకు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పలు పథకాలను అమలు చేస్తోందని ఆత్మకూరు మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ ఇఫ్తకర్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి ద్వారా ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతులకు రైతు భరోసా, చేయూత పథకం వంటి అన్ని పథకాలు అర్హులైన కుటుంబాలకు సంక్షేమ ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటోందన్నారు. పలు కొత్త సామాజిక భద్రతా కార్యక్రమాలు, కుటుంబ బీమా వంటి పథకాలను కూడా ప్రవేశపెట్టిందన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసి బస్సు ప్రయాణం, గృహ జ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకం రైతు భరోసా, చేయూత పింఛన్లు మహిళా సాధికారతకు మహాలక్ష్మి వంటి సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు ప్రతి పేదోడి ఇంటికి చేరడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజల అభివృద్ధి, సామాజిక భద్రత మరియు సమాన అవకాశాల కోసం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు డిసిసి అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామారెడ్డి గారి చొరవతో పలు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయనీ ఆత్మకూరు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఇఫ్తాకార్ అన్నారు