మీడియా ప్రతినిధులకు 2026–28 సంవత్సరాలకు కొత్త అక్రిడేషన్ కార్డు
తెలుగు గళం న్యూస్ జనగామ ఏప్రిల్ 29
జిల్లాలోని మీడియా ప్రతినిధులకు 2026–28 సంవత్సరాలకు కొత్త అక్రిడేషన్ కార్డుల జారీకి సంబంధించి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ కమిటీలో సభ్యులుగా నియామకానికి అర్హులైన జర్నలిస్టులు తమ దరఖాస్తులను మే 1, 2026 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్ఓ) కార్యాలయంలో సమర్పించాలని అధికారులు కోరారు.ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 252 ప్రకారం కమిటీలో బిగ్ తెలుగు డైలీ, ఉర్దూ డైలీ, మీడియం డైలీ, స్మాల్ డైలీ, ఎలక్ట్రానిక్ మీడియా, వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టుల నుండి ఒక్కొక్కరు సభ్యులుగా ఎంపిక చేయనున్నారు.అర్హతల ప్రకారం అభ్యర్థులు ఫుల్ టైం జర్నలిస్టులు కావాలి. బిగ్ డైలీ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కనీసం 10 సంవత్సరాల అనుభవం, మిగతా వర్గాల వారికి కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.జిల్లాలోని మీడియా సంఘాలు తమ ప్రతినిధుల పేర్లను గడువు లోపు సమర్పించాలని, గడువు తర్వాత వచ్చే దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబడవని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తుతో పాటు అక్రిడేషన్ కార్డు ప్రతిని తప్పనిసరిగా జతపరచాలని సూచించారు.