ధర్మసాగర్లో ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యత సదస్సు
వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ (డీసీసీబీ) ధర్మసాగర్ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక,సాంకేతిక అక్షరాస్యత సదస్సును ధర్మసాగర్ రైతు వేదికలో నిర్వహించారు.నాబార్డ్ ఆదేశాల మేరకు రైతులు, ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా డీసీసీ బ్యాంక్ ధర్మసాగర్ శాఖ మేనేజర్ ఆర్. వెంకటేష్ మాట్లాడుతూ బ్యాంకు అందిస్తున్న వివిధ పథకాలను వివరించారు.నూతన డిపాజిట్ పథకం “రాణి రుద్రమదేవి డిపాజిట్ స్కీమ్” కింద ఖాతాదారులకు అత్యధికంగా 8.10 శాతం వడ్డీ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే రైతుల అభివృద్ధి కోసం దీర్ఘకాలిక రుణాలు, బర్రెలు, గొర్రెలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు రుణ సదుపాయాలు, హౌసింగ్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ప్రస్తుత సాంకేతిక యుగంలో బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసేందుకు ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, లాకర్ సదుపాయాలు కూడా అందిస్తున్నట్లు వివరించారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ సూపర్వైజర్ శ్రీనివాస్ రెడ్డి, ధర్మసాగర్ మండల వ్యవసాయ అధికారి రాజేష్, ఏఈఓ దివ్య, ధర్మసాగర్ పీఏసీఎస్ కార్యదర్శి పింగిలి రాజిరెడ్డి, పీఏసీఎస్ సిబ్బంది ఆవుల కుమారస్వామి, బొడ్డు ప్రభుదేవ్, కలకోటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.