మానవ సేవే మాధవ సేవ గ్రూప్ సభ్యుల ఆర్ధిక సాయం
స్టేషన్ ఘనపూర్ మండలం పాంనూర్ గ్రామంలో తాళ్ళపెల్లి రాజమ్మ అనారోగ్యంతో మరణించారు.తాళ్ళపెల్లి రాజమ్మ భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు.తాళ్ళపెల్లి రాజమ్మకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.మానవ సేవే మాధవ సేవ గ్రూప్ సభ్యులు రాజమ్మ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు.ఈ కార్యక్రమంలో మానవ సేవే మాధవ సేవ గ్రూప్ సభ్యులందరూ పాల్గొన్నారు.
