రేషన్ బియ్యం తరలిస్తున్న ఓ లారీని స్వాధీనం
సత్తుపల్లి,ఆర్ సి,ఆగస్టు 05(తెలుగుగళం) న్యూస్:
సత్తుపల్లి పట్టణంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం తరలిస్తున్న ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు లారీతో పాటు అందులో ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
పోలీసుల విచారణలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. బియ్యం ఎక్కడి నుంచి సేకరించారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ వ్యవహారంలో ఇంకెవరు ఉన్నారనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమాచారం ఉన్న ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.