E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ2 September, 2026E69NEWS

వన్ మినిట్ రూల్‌.. విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు భరోసా

ఘనపూర్‌లో టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి సుడిగాలి పర్యటన

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 2

విద్యుత్ నిర్వహణ పనులు చేపట్టే ముందు సిబ్బంది తప్పనిసరిగా ఒక నిమిషం ఆగి భద్రతా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి అన్నారు.‘వన్ మినిట్ రూల్’ విధానం విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు భరోసా లాంటిదని పేర్కొన్నారు.బుధవారం స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంతో పాటు డివిజన్ పరిధిలోని పాలకుర్తి సబ్ డివిజన్‌లో జిల్లా ఎస్ఈ చెరుకు సంపత్‌రెడ్డితో కలిసి సీఎండీ వరుణ్‌రెడ్డి సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి సబ్ డివిజన్ కార్యాలయం, ఈఆర్‌ఓ, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లను పరిశీలించి సిబ్బందికి భద్రతా నియమాలపై పలు సూచనలు చేశారు.అనంతరం ఘనపూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న డీఈ, ఈఆర్‌ఓ కార్యాలయాలతో పాటు ఎస్పీఎం (ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రం) భవన నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులు, సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత భవనాల నిర్మాణం పూర్తయితే విద్యుత్ వినియోగదారులకు అవసరమైన సేవలు ఒకే చోటు నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

సిబ్బందితో ‘పెప్ టాక్’

సబ్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ సిబ్బందితో ‘పెప్ టాక్’ కార్యక్రమం నిర్వహించిన సీఎండీ.. విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను సిబ్బందిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అవసరమైన పరికరాలు, వనరులు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలపై చర్చించారు.వినియోగదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సరఫరాలోని సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని సూచించారు. విద్యుత్ లైన్లలో సమస్యాత్మక, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర పనుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని స్పష్టం చేశారు. అవసరమైన వనరులు అందించేందుకు సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు.విద్యుత్ సిబ్బంది తప్పనిసరిగా భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని సూచించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. సరఫరాలో సమస్యలు ఎదురైతే వినియోగదారులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరారు.

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటిన అధికారులు

ఈ సందర్భంగా అధికారులు, విద్యుత్ సిబ్బందితో కలిసి సబ్ డివిజన్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ పచ్చదనాన్ని పెంపొందించాలని సీఎండీ వరుణ్‌రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో ఈఈ/సివిల్ అనూప్, డీఈ ఆపరేషన్ బి.సారయ్య, డీఈ/ఎంఆర్టీ విజయ్‌కుమార్, ఏడీఈలు రణధీర్‌రెడ్డి, శ్రీధర్, సామిరెడ్డి, హుస్సేన్, రమేష్, ఏఈలు శ్వేత, సుమన్, శంకర్, రణధీర్, శివకుమార్, సురేష్, కరుణాకర్, రాజశేఖర్, సబ్ ఇంజనీర్లు సాధన, హరిత, మన్విత, రాకేష్, రాంబాబు, నర్సింహారెడ్డి, వీరస్వామి, రామాచారి, యాదగిరి, పెద్దిరెడ్డి, కాలురామ్, రామ్మూర్తి, రాజ్‌కుమార్, ఫయాజ్, సుకేష్, సదన్, లక్పతి, సుధాకర్, అన్వర్, ఐలయ్య, నాగరాజు, రాము, సాంభరాజు, అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *