సంతోష్ కుటుంబానికి అండగా ఉంటాం-ఎమ్మెల్యే కేఆర్
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన మైదం సంతోష్ పార్థివదేహానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులర్పించారు.ఇల్లందలో సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందజేశారు.మృతుడు సంతోష్‌కు ముగ్గురు చిన్నారులు ఉన్నందున, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన సంతోష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం,వర్ధన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎద్దు రాజేంద్ర ప్రసాద్, టెంపుల్ డైరెక్టర్ గుంటి కుమారస్వామి,ఇందిరమ్మ కమిటీ సభ్యుడు గడ్డం సమ్మయ్య,వార్డు మెంబర్ ఎలికట్టె చిన్నరాజు,పల్లె రాజు,మైదం బుచ్చిమల్లు, బాషబోయిన ప్రవీణ్,దుపెల్లి ఏలియా,జోగుల పార్షా తదితరులు పాల్గొన్నారు