సంపూడి మహేష్ జన్మదినం సందర్భంగా ఉచిత అల్పాహార పంపిణీ
సత్తుపల్లి పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్, సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు కూసంపూడి మహేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు చాంద్ పాషా, అద్దంకి అనిల్, వల్లభనేని పవన్,పర్వతనేని వేణు ల ఆధ్వర్యంలో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, ప్రధాన రోడ్డులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోగులు, వారి సహాయకులు, ప్రజలకు ఉచిత అల్పాహారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూసంపూడి మహేష్ సేవా దృక్పథాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. మహేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మిద్దె శ్రీను, షేక్ బాబు, అప్పు, లయన్స్ క్లబ్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు