సత్తుపల్లి ఏరియా స్ట్రక్చర్ కమిటీ సమావేశం
సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సరికొండ వెంకటా చారి అధ్యక్షతన శనివారం స్ట్రక్చర్ సమావేశం జి.ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించారు.సత్తుపల్లి ఏరియా పరిధిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏరియా అధికారులతో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో ఐ.ఎన్.టి.యూ.సీ నాయకులు కోరారు.స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా సత్తుపల్లి జి.ఎం కార్యాలయంలో పర్సనల్ డిపార్ట్మెంట్ , ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు , ఉద్యోగులకు రెయిన్ కోట్లు పంపిణీ , కిష్టారం ఓసిలో అదనంగా రెస్ట్ షెల్టర్ , వాష్ రూమ్ ల ఏర్పాటు , డిస్పెన్సరీ ఆధునికరణ , స్టాఫ్ పెంపు , ఆర్వో ప్లాంట్ , పర్మనెంట్ టెలిఫోన్ ఏర్పాటు చేయాలని , జే.వి.ఆర్ సి.హెచ్.పి లో డస్ట్ నియంత్రణ , క్యాంటీన్ మెరుగుపరచుట మరియు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు.అదేవిధంగా గతంలో జరిగే స్ట్రక్చర్ మీటింగ్ అంశాలపై చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.జనరల్ మేనేజర్ సరికొండ వెంకటాచారి మాట్లాడుతూ ప్రాతినిధ్య సంఘం నాయకులు ప్రస్తావించిన పనులను పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జనరల్ మేనేజర్ కార్యాలయంలో సోమవారం , బుధవారం , శుక్రవారం ఫైనాన్స్ , క్వాలిటీ , ఐటి , సర్వే డిపార్ట్మెంట్ల హెచ్.ఓ.డి లు మరియు మంగళవారం , గురువారం , శనివారం పర్సనల్ , ఐ.ఇ.డి , సెక్యూరిటీ , వివిధ డిపార్ట్మెంట్ల హెచ్.ఓ.డి లు అందుబాటులో ఉండే విధంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కృషి చేస్తుందని , ఇప్పటివరకు ఏ విధంగా ఉత్పత్తి లక్ష్యసాధనలో సహకరించారో ఇక ముందు కూడా సహకరించి సంస్థ పురోఅభివృద్ధిలో తోడ్పడాలని జనరల్ మేనేజర్ సరికొండ వెంకటా చారి కోరారు.ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు బొల్లం శ్రీనివాస్ ( ఎస్ ఓ టు జి.ఎం ) , ప్రహ్లాద్ ( ప్రాజెక్ట్ ఆఫీసర్ , జే.వి.ఆర్ ఓసి ) , సునీల్ వర్మ ( ప్రాజెక్ట్ ఆఫీసర్ , కిష్టారం ఓసి ) , శ్రీనివాస్ రావు ( ప్రాజెక్ట్ ఇంజినీర్ ) , సోమశేఖర్ ( ఏరియా ఇంజనీర్ ) , తిరుపతి ( పర్సనల్ ఆఫీసర్ ) , సాయి నాథ్ ( డీ.జీ.ఎం , జే.వి.ఆర్ సి.హెచ్.పి ) , ప్రదీప్ , రవి కుమార్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు , సివిల్ , ఐ.ఇ.డి డిపార్ట్మెంట్ ల అధికారులు , సంక్షేమ అధికారి శ్రీనివాస్ ఇతర డిపార్ట్మెంట్ల అధికారులు , ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘం నాయకులు కోటేశ్వరరావు , క్రాంతి కుమార్ , నాగ ప్రకాష్ పాల్గొన్నారు