ఇండ్ల స్థలాల పేదలు జైల్ బరో కు రండి సీపీఎం
సత్తుపల్లి మండలం కాకర్లపల్లి, తుంబూరు గ్రామాలలో ఇండ్లు లేని పేదలతో సీపీఎం నాయకులు జాజిరి శ్రీనివాస్,జ్యోతి లు ఆదివారం సమావేశమయ్యారు. ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు,పక్కా ఇళ్లు ఇవ్వాలని ధర్నాలు చేసినా,వినతిపత్రాలు ఇచ్చినా,ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని పోలీసులతో నిర్బంధాలను మోపారని మరో పోరాటానికి సిద్ధం కావాలన్నారు.నేడు జరిగే జైల్ బరో లో పాల్గొనాలని కోరారు.