E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ2 September, 2026E69NEWS

ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలపై పరిశీలన

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 02

స్టేషన్ ఘనపూర్ మండలంలో ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్ ద్వారా ఎరువుల విక్రయాల అమలు ప్రక్రియను మండల వ్యవసాయ అధికారి బుధవారం పరిశీలించారు.మండల పరిధిలో మొత్తం 30 ఎరువుల విక్రయ కేంద్రాలు ఉన్నాయని, ప్రస్తుతం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌కు సంబంధించిన అప్‌డేషన్‌ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. సాయంత్రం వరకు అన్ని అప్‌డేట్లతో పాటు గ్రామాల మ్యాపింగ్‌, జిల్లా డీలర్ల మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే రైతులకు అవసరమైన ఎరువులను యాప్‌లో ఎలా బుక్‌ చేసుకోవాలి, అనంతరం ఈ-పాస్‌ యంత్రం ద్వారా ఎరువుల విక్రయాన్ని ఎలా పూర్తి చేయాలనే విషయాలను మండల వ్యవసాయ అధికారి రైతులు, ఎరువుల డీలర్లకు స్వయంగా వివరించారు.ఎరువుల బుకింగ్‌ నుంచి ఈ-పాస్‌ ద్వారా విక్రయం పూర్తయ్యే వరకు మొత్తం ప్రక్రియను ప్రత్యక్షంగా నిర్వహించి, విజయవంతంగా విక్రయాన్ని పూర్తి చేసి చూపించారు.మండలంలోని ఎరువుల డీలర్లు ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌, ఈ-పాస్‌ విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎరువుల విక్రయాలను సజావుగా నిర్వహించాలని మండల వ్యవసాయ అధికారి సూచించారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *