గదగ్ జిల్లా నూతన ఎస్పీని కలిసిన అహ్మదీయ ముస్లిం ప్రతినిధుల బృందం

ఈ69న్యూస్ గదగ్, కర్ణాటక సెప్టెంబర్ 02
అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ గదగ్ జిల్లా ప్రతినిధుల బృందం జిల్లా నూతన పోలీసు సూపరింటెండెంట్ హెచ్.ఎన్. మిథున్ కుమార్, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపింది.ఈ సందర్భంగా సుమారు 20–25 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ గురించి ప్రతినిధులు ఎస్పీకి పరిచయం చేశారు. అలాగే “వరల్డ్ క్రైసిస్: ది పాత్వే టు పీస్” పుస్తకం గురించి వివరించారు.ప్రపంచ శాంతి, మూడో ప్రపంచ యుద్ధం మరియు అణు యుద్ధం వల్ల కలిగే ప్రమాదాలపై ఐదవ హజ్రత్ ఖలీఫతుల్ మసీహ్ (అబా) అందిస్తున్న సందేశాన్ని ఎస్పీకి ప్రతినిధులు వివరించారు. ఈ సందేశాన్ని ఎస్పీ హెచ్.ఎన్. మిథున్ కుమార్ ఆసక్తిగా విని అభినందించినట్లు ప్రతినిధులు తెలిపారు.అలాగే పుస్తకాన్ని చదివి, తన అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా తెలియజేస్తానని ఎస్పీ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. సమావేశం ఎంతో సానుకూలంగా, ప్రోత్సాహకరంగా సాగిందని అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ జిల్లా ముబల్లిగ్ ఇన్చార్జి మహమ్మద్ రషీద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.