దర్ధపల్లిలో దండెమ్మ తల్లి బోనాల వేడుకలు
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం పరిధిలోని దర్ధపల్లి గ్రామంలో దండెమ్మ తల్లి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి ఉష దయాకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామ ప్రజలు, భక్తులతో కలిసి బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు