

ఈ69 న్యూస్ వరంగల్/వర్ధన్నపేట ఏప్రిల్ 29
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ముహమ్మద్ తాహిర్ అహ్మద్ పదవ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబర్చాడు.వర్ధన్నపేటలోని అల్ఫోర్స్ స్కూల్లో విద్యనభ్యసించిన తాహిర్ అహ్మద్, తాజాగా విడుదలైన ఫలితాల్లో 600 మార్కులకు గాను 580 మార్కులు సాధించి స్కూల్ సెకండ్ టాపర్‌గా నిలిచాడు.చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి పెంచుకుని క్రమశిక్షణతో శ్రమించిన తాహిర్ అహ్మద్, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని ఈ అద్భుత విజయాన్ని సాధించాడు.సమయపాలన, పట్టుదల, కృషి అతని విజయానికి ప్రధాన కారణాలుగా ఉపాధ్యాయులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి తాహిర్ అహ్మద్‌ను అభినందిస్తూ, అతని కృషి, నిబద్ధత ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయని ప్రశంసించారు.భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.తల్లిదండ్రులు యాకూబ్‌బీ, ముహమ్మద్ ఖాజామియా తమ కుమారుడి విజయంపై ఆనందం వ్యక్తం చేయగా, గ్రామ ప్రజలు, బంధువులు, స్నేహితులు తాహిర్ అహ్మద్‌ను అభినందించారు.