
ఈ69న్యూస్ జఫర్ఘడ్ ఏప్రిల్ 29
ఈరోజు అనగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో, తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు విద్యార్థులకు అండగా నిలవాలని జనగామ జిల్లా జఫర్ఘడ్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పట్టపురి విజయ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.ఫలితాలు వచ్చిన సమయంలో కొంతమంది విద్యార్థులు తక్కువ మార్కులు రావడం లేదా ఫెయిల్ అవడం వంటి కారణాలతో క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలతో పాటు ఉండి, వారికి మనోధైర్యం కల్పించాలని సూచించారు. పదవ తరగతి పరీక్షలు జీవితంలో ఒక భాగమే కాని అంతా కాదని, జీవితంలో ఎన్నో అవకాశాలు, సవాళ్లు ఉంటాయని గుర్తుచేశారు.ఒక అభినందన లేదా ప్రేమపూర్వక మాట విద్యార్థుల జీవితాన్ని మార్చగలదని, తక్కువ మార్కులు వచ్చినా లేదా ఫెయిల్ అయినా పిల్లలను మందలించకుండా ప్రోత్సహించాలని కోరారు.విద్యార్థుల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు.