




ఈ69న్యూస్ జనగామ ఏప్రిల్ 29
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం రైతాంగ సమస్యలపై వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు.అదే సమయంలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి హాజరైన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కూడా రైతుల సమస్యలను వివరిస్తూ వినతి పత్రం సమర్పించారు.జనగామ మండలంలోని గాను పహాడ్ క్రాస్ వద్ద కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు జిల్లాలోని ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించి పలు సమస్యలను గుర్తించినట్లు తెలిపారు.రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు—ధాన్యం కొనుగోలులో జాప్యం, ట్రాన్స్పోర్ట్ లారీల కొరత, గన్ని సంచుల లభ్యత లేకపోవడం, మిల్లర్ల అక్రమాలు—తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే షాటేజీ పేరుతో రైతులపై భారం మోపుతున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ ధర్నా సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుని కొంతమంది రైతు నాయకులను అరెస్టు చేసి అనంతరం వ్యక్తిగత పూచికతపై విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.