పదోన్నతి పొందిన విద్యుత్ ఉన్నతాధికారులకు ఘన సన్మానంపదోన్నతి పొందిన విద్యుత్ ఉన్నతాధికారులకు ఘన సన్మానం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ7 July, 2026E69NEWS

పదోన్నతి పొందిన విద్యుత్ ఉన్నతాధికారులకు ఘన సన్మానం

పదోన్నతి పొందిన విద్యుత్ ఉన్నతాధికారులకు ఘన సన్మానం

విద్యుత్ శాఖలో పదోన్నతులు (ప్రమోషన్లు) పొందిన ముగ్గురు ఉన్నతాధికారులకు గిరిజన విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.బాబు సీజీఎం (ఆడిట్) గా,సత్యనారాయణ సీజీఎం (చీఫ్) గా, అనిల్ రెడ్డి జీఎం (ఆడిట్) గా పదోన్నతి పొందిన సందర్భంగా మంగళవారం హనుమకొండలో వారిని కలిసి ప్రత్యేకంగా అభినందించారు.గిరిజన విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం కంపెనీ ప్రెసిడెంట్ హర్జీ నాయక్, కంపెనీ జనరల్ సెక్రెటరీ అజ్మీరా శ్రీరామ్ నాయక్ ల నేతృత్వంలో విద్యుత్ ఉద్యోగులు అందరూ కలిసి అధికారులకు పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, పదోన్నతులు పొందిన అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంస్థ అభ్యున్నతికి, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గిరిజన విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, వివిధ విభాగాల విద్యుత్ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *