పర్వతగిరి ప్రీ-ప్రైమరీ మెరిట్ లిస్ట్‌పై అభ్యంతరాలకు స్వీకరణ
పర్వతగిరి మండలంలోని ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు సంబంధించి విడుదల చేసిన మెరిట్ జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ఏ. బిక్షపతి తెలిపారు.పర్వతగిరి, ఏనుగల్, కొంకపాక,అన్నారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇటీవల విడుదల చేసిన ఇన్స్ట్రక్టర్ పోస్టుల మెరిట్ జాబితా పాఠశాలల వారీగా మండల విద్యా వనరుల కేంద్రం ఎమ్ ఆర్ సి లో అందుబాటులో ఉంచినట్లు ఆయన చెప్పారు.మెరిట్ జాబితాలోని ర్యాంకింగ్, స్థానికత తదితర అంశాలపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే,ఈరోజు మధ్యాహ్నం 1 గంటలోపు పర్వతగిరి ఎమ్ ఆర్ సి కార్యాలయంలో రాతపూర్వకంగా సమర్పించాలని సూచించారు.
వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తామని ఎమ్ ఈ ఒ వెల్లడించారు. స్థానికత,మెరిట్ ఆధారంగానే జాబితా రూపొందించినట్లు స్పష్టం చేశారు.