చివరి తేదీ: జూన్19,సాయంత్రం 4 గంటల వరకు
చివరి తేదీ: జూన్19,సాయంత్రం 4 గంటల వరకు
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 14
వరంగల్ జిల్లా:పర్వతగిరి, మండలంలోని అన్నారం, కొంకపాక, ఏనుగల్ ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ఏ. బిక్షపతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హతలు: ఇన్స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్, ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:జనరల్ అభ్యర్థులకు 18 నుంచి 44 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్మెన్కు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.ఎంపిక విధానం: స్థానికత, విద్యార్హత మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 19వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని ఎంఈఓ బిక్షపతి సూచించారు.