BREAKING NEWS
రాఘవపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం–ఇద్దరికి తీవ్ర గాయాలు




ఈ69 న్యూస్, స్టేషన్ ఘనపూర్, మే 5
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల వివరాల ప్రకారం, రాఘవపూర్ నుండి స్టేషన్ ఘనపూర్ వైపు వస్తుండగా చాగల్లు వద్ద ఆగి ఉన్న బస్సును వారు ప్రయాణిస్తున్న వాహనం వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి.అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.గాయపడిన యువకుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.