•రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్: సమర శంఖం పూరించిన బీఆర్ఎస్
రైతు సదస్సు పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
•రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్: సమర శంఖం పూరించిన బీఆర్ఎస్
తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/మే 3
వరంగల్ జిల్లా:వరంగల్ నగరంలోని హంటర్ రోడ్ గ్రీన్ వుడ్ హై స్కూల్ పక్కన ఈనెల మే6ఉదయం 9 గంటలకు నిర్వహించబోయే రైతు సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో సభా స్థలాన్ని పరిశీలించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్,రైతు సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.అనంతరం ప్రెస్ మీట్లో మాట్లాడారు.మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ…అన్నదాతలారా… నా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలారా…కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు ఎక్కడ? రుణమాఫీ పూర్తయిందా?రైతు బంధు సమయానికి వస్తుందా? పంటకు సరైన ధర ఇస్తున్నారా? రైతు గోదాముల్లో పంట పడి నష్టపోతున్నాడు. ఇవి హామీలా? లేక మోసమా?”అని ప్రశ్నించారు.రైతు ఏడుస్తుంటే కాంగ్రెస్ నాయకులు సొంత పనులు చూసుకుంటున్నారు. సొంత కుర్చీల కోసం రాజకీయాలు చేస్తున్నారు.రైతు బతికితేనే దేశం బతుకుతుంది.కానీ ఈ కాంగ్రెస్ పాలనలో రైతు అప్పుల్లో కూరుకుపోతున్నాడు.రైతు కష్టాలు చూస్తూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు మాత్రమే చెబుతోంది”అని ధ్వజమెత్తారు.రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ నమ్మకద్రోహంపై బీఆర్ఎస్ సమర శంఖం పూరిస్తోంది. మే 6న వరంగల్ రైతు సదస్సును విజయవంతం చేద్దాం. వరంగల్ గడ్డపై కాంగ్రెస్ వంచనను ఎండగడదాం.హామీ ఇచ్చి నిలబెట్టని ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గట్టి సమాధానం ఇవ్వాలి” అని పిలుపునిచ్చారు.పాలన అంటే పోస్టర్లు కాదు… పొలాల్లో ఫలితం కనిపించాలి. రైతు చెమటే రాష్ట్రానికి బంగారం… దాన్ని కాపాడలేకపోతే సిగ్గు పడాలి”అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,రైతు ప్రతినిధులు పాల్గొన్నారు