వర్షాలు సమృద్ధిగా కురవాలని ముత్యాలమ్మ తల్లికి జలాభిషేకం"
నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల
రామన్నపాలెం గ్రామంలో సుమిత్ర, వెంకటేశ్వరమ్మ నాటు ముఠా ఆధ్వర్యంలో గ్రామ ఆరాధ్య దైవమైన శ్రీ ముత్యాలమ్మ తల్లికి జలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. గ్రామ ప్రజలందరిపై ముత్యాలమ్మ తల్లి కరుణాకటాక్షాలు ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.