శంభునిగూడెం లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
పాల్గొన్న సర్పంచ్,ఉప సర్పంచ్”
తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ: ఇజ్జిగాని గంగాజలం(బీరాపల్లి సెక్టార్ సూపర్ వైజర్)
నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల శంభునిగూడెం గ్రామంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రదర్శన బీరాపల్లి సెక్టార్ సూపర్ వైజర్ ఇజ్జిగాని గంగాజలం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది. తల్లిపాలే పుట్టిన శిశువుకు తొలి రక్షణ అని గంగాజలం గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు.గ్రామ సర్పంచ్ అరవపల్లి నరసింహారావు, ఉప సర్పంచ్ నాగేంద్రబాబు లు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలు ఎంత ముఖ్యమో వివరించారు.చిన్నారులకుఅన్నప్రాసనలు చేశారు. తల్లిపాల ప్రయోజనాలు, చిన్నారుల సంరక్షణ, సమతుల్య పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవన విధానంపై మహిళలకు గంగాజలం అవగాహన కల్పించారు. అనంతరం ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించి, పోషకాహారంపై సందేహాలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో: హెల్త్ సూపర్వైజర్ ఫాతిమా బేగం,పంచాయతీ కార్యదర్శి స్వాతి, అంగన్వాడీ టీచర్లు రాహేలు,కరుణ,రజిత, ఇందిర,ఆశా కార్యకర్త పుల్లమ్మతో పాటు గ్రామ మహిళలు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.