
ఈ69న్యూస్ జనగామ
జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గం తానేదార్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించారు.మోడల్ హౌస్ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్,భూమి పూజ వివరాలు,మొరం,ఇసుక వాడకం వంటి అంశాలను తెలుసుకున్నారు.ఇప్పటికే బేస్మెంట్ పూర్తయిన ఇళ్లకు సంబంధించిన ఫోటోలను యాప్లో నమోదు చేసి తదుపరి దశకు రూ.లక్ష మంజూరు చేయాలని సూచించారు.ఈ పర్యవేక్షణలో పీడీ మాతృ నాయక్,ఎంపిడిఓ విజయశ్రీ,తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.