
హైదరాబాద్, ఈ69న్యూస్:
రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల ఆమోదంలో గవర్నర్లు ఆలస్యం చేయడం రాజ్యాంగపరంగా సరికాదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. ఇటువంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు జోక్యం అవసరమని పేర్కొన్నారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్లు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడాన్ని కోర్టు తప్పుబట్టినట్లు గుర్తు చేస్తూ, బిల్లుల విషయంలో కూడా అదే తరహా తీర్పు రావచ్చని అభిప్రాయపడ్డారు.డబ్ల్యూజెఐ ప్రతినిధులతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.వీసా గడువు ముగిసిన వారిని గుర్తించడంలో పౌరులూ బాధ్యత వహించాలని సూచించారు.నీటి సమస్యను రాష్ట్రాల మధ్య వివాదంగా కాకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు.