గ్రామ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు మందపాటి సూర్య ప్రకాశ్ రెడ్డి
సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్27(తెలుగుగళం) న్యూస్: మండలం సదాశివునిపాలెం గ్రామంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు మందపాటి సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తుంబూరు దామోదర్ రెడ్డి, కాల్నేని వెంకటేశ్వరరావు లు పాల్గొని పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యక్రమాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో:దుబ్బాక చందు, ముసిపట్ల సాంబశివరావు, సాకి శ్రీనివాసరావు, కిష్టా శివ ప్రసాద్, గుడే నాగేష్, కోటమర్తి నాగేసు, అన్నెపు వెంకటేష్, బండి రాంబాబు, కర్నాటి భద్రం తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.