ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ
తెలుగు గళం న్యూస్ కొడకండ్ల, ఏప్రిల్ 27
మండుతున్న ఎండల నడుమ ప్రయాణికులకు ఉపశమనం కల్పించే ఉద్దేశంతో ప్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొడకండ్ల బస్టాండ్ వద్ద చలివేంద్రం కార్యక్రమం కొనసాగుతోంది. గత పది రోజులుగా సాగుతున్న ఈ సేవలో భాగంగా సోమవారం చల్లని మజ్జిగను ప్రయాణికులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి కొడకండ్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దోర్నం ప్రభాకర్ తమ్ముడు ఉపేందర్, వారి సహధర్మచారిణి శ్యామల దంపతులు ముంబాయిలో నుంచే స్పందించి ఆర్థిక సహాయం అందించారు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చల్లని మజ్జిగ అందుకోవడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ పెదపుడి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, సేవా కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా గమనించి ముందుకు వచ్చి సహాయం చేసిన ఉపేందర్ దంపతులను అభినందించారు. వారి సహకారం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొంటూ, ఫౌండేషన్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలిపారు.