జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
పెట్రోల్ బంక్ లలో నిల్వలను పరిశీలించి నివేదికలను అందించండి
తెలుగు గళం న్యూస్ జనగామ ఏప్రిల్ 28
జనగామ జిల్లాలో ఇంధన సరఫరా విషయంలో ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలు సహకరించాలని, అవసరమైన మేరకే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో తహసీల్దార్, సివిల్ సప్లై, పోలీస్, లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి నిల్వలను పరిశీలించాలని సూచించారు.పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నప్పటికీ “స్టాక్ లేదు” అనే బోర్డులు పెట్టే బంక్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హెచ్చరించారు. సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.జిల్లాలో ఎక్కడైనా పెట్రోల్ లేదా డీజిల్ కొరత ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 00 333 లేదా రాష్ట్ర విపత్తుల హెల్ప్‌లైన్ 1077కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.ముందస్తుగా క్యాన్లలో అధిక పరిమాణంలో ఇంధనం నిల్వ చేసుకోవద్దని కోరారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోం, ఆర్డీవోలు గోపిరామ్, వెంకన్న, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, వైద్య, సంక్షేమ శాఖల అధికారులు మరియు పెట్రోల్ బంక్ డీలర్లు పాల్గొన్నారు.