ఘనంగా స్వయంకృషి మున్నూరు కాపు సంఘం 20వ వార్షికోత్సవంఘనంగా స్వయంకృషి మున్నూరు కాపు సంఘం 20వ వార్షికోత్సవం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ23 August, 2026E69NEWS

ఘనంగా స్వయంకృషి మున్నూరు కాపు సంఘం 20వ వార్షికోత్సవం

ఘనంగా స్వయంకృషి మున్నూరు కాపు సంఘం 20వ వార్షికోత్సవం

కొడవటంచలో ఆత్మీయ సమ్మేళనం.. సభ్యులకు వెండి నాణేల పంపిణీ

జయశంకర్ భూపాలపల్లి పట్టణానికి చెందిన స్వయంకృషి మున్నూరు కాపు సంఘం 20వ వార్షికోత్సవం (ఆత్మీయ సమ్మేళనం) రేగొండ మండల పరిధిలోని కొడవటంచలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు భాస్కరి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై,సంఘ సభ్యులకు వెండి నాణేలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయంకృషి మున్నూరు కాపు సంఘం ఏర్పాటై 20 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.ఈ సుదీర్ఘ ప్రయాణంలో సంఘం ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి,సేవా కార్యక్రమాలు నిర్వహించామని,ముఖ్యంగా అనాథ పిల్లలకు,వృద్ధులకు దుస్తుల పంపిణీ వంటి సమాజహిత కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు.రానున్న రోజుల్లో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కొట్రంగి నాగార్జున,ఉపాధ్యక్షులు దేవరకొండ మధు,మేడ వెంకటస్వామి,కోశాధికారి భాస్కర్ల సుధాకర్,జాయింట్ సెక్రటరీ గంపల దేవేందర్,అధికార ప్రతినిధి సుంకరి గోవర్ధన్ తదితర సభ్యులు పాల్గొన్నారు

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *